సారే జహాసే అచ్ఛా… ఆలపించిన పాకిస్తాన్‌లోని ప్రముఖ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు

సారే జహాసే అచ్ఛా… ఆలపించిన పాకిస్తాన్‌లోని  ప్రముఖ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణు యుద్ధం చేస్తామంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్‌. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌లోని ప్రముఖ పార్టీ MQM పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హస్సేన్ చేసిన పని హాట్‌ టాపిగ్గా మారింది. లండన్‌లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కసారిగా సారే జహాసే అచ్ఛా.. హిందూ సితా హమారా అంటూ పాట పాడారు. దీంతో ఆ సమావేశానికి హాజరైన వారే కాదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకయ్యారు. ఈ వీడియోని నెట్‌లో తెగ షేర్‌ చేస్తున్నారు ఇండియన్‌ నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story