తాజా వార్తలు

MRO కాళ్లు మొక్కిన రైతులు.. కనికరించని అధికారి

MRO కాళ్లు మొక్కిన రైతులు.. కనికరించని  అధికారి
X

తమ భూమి సమస్యను పరిష్కరించాలంటూ చేవెళ్ల తహసిల్దార్‌ కాళ్లపై పడ్డారు రైతులు. చేవెళ్ల మండలం ఆఫీస్‌ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఈఘటన తీవ్ర దుమారం రేపుతోంది. కాళ్లపై పడి ప్రాధేయపడ్డా ఆ MRO రైతులను కనికరించలేదు .. కనీసం హామీ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు .ఆలూరు గ్రామానికి చెందిన లింగయ్యతో పాటు మరో రైతు తమ భూ సమస్యకు పరిష్కారమార్గం చూపాలంటూ చేవెళ్ల MRO కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు. అయినా తహసిల్దార్‌ స్పందించకపోవడంతో తమ భూసమస్యను ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు..

Next Story

RELATED STORIES