ట్రంప్ పెద్ద మనసు .. ఇండో-అమెరికన్ లాయర్‌కు అరుదైన అవకాశం

ట్రంప్ పెద్ద మనసు .. ఇండో-అమెరికన్ లాయర్‌కు అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఇండో-అమెరికన్‌ను ఫెడరల్ జడ్జిగా నియమించారు. అమెరికాలో వైట్ కాలర్ నేరాలను దర్యాప్తు చేయడంలో స్పెషలిస్ట్‌ అయిన షిరిన్ మాథ్యూల్ నియామకాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఖరారు చేసింది. అయితే ఆమె నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. సెనేట్ ఆమోదం తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డీగో డిస్టిక్ కోర్టులో పెడరల్ జడ్జిగా షిరిన్ విధులు నిర్వహించనున్నారు. ఈమె ప్రస్తుతం కాలిపోర్నియాలోని ఫెడరల్ కోర్టులో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నారు. జుడీషియరీకి నామినేట్ అయిన ఇండో-అమెరికన్లలో ఈమె ఆరోవారు. ఈమె దక్షిణాసియా బార్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఫెడరల్ జడ్జిగా షిరీన్ పేరును త్వరగా ఆమోదం తెలుపాలని సౌత్ ఏషియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనీష్.. సెనేట్‌కు విజ్ఞప్తిచేశారు. ట్రంప్ ఇటీవల ఇండో అమెరికన్స్ అయిన నియోమీరావు, థాపర్,డయానే గుజరాతీ, అనురాగ్ సింఘాల్ లను జడ్జీలుగా నియమించారు.

Tags

Read MoreRead Less
Next Story