అవంతి, గంటా మధ్య విభేదాలకు కారణం అదేనా?

అవంతి, గంటా మధ్య విభేదాలకు కారణం అదేనా?

విశాఖ రాజకీయాల్లో గురుశిష్యులుగా, మంచి మిత్రులుగా, కలిసి పనిచేసిన గంటా శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మంత్రి అవంతి. తన జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తానంటూ హెచ్చరించారాయన. తూటాల్లాంటి మాటలతో రెచ్చిపోయారు.

అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇద్దరి మధ్య భీమిలి నియోజకవర్గంపై వార్ నడిచింది. అప్పటివరకు టీడీపీలో ఉన్న అవంతి.. వైసీపీలోకి మారి భీమిలి నుంచి బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న.. ఆనాటి మంత్రి గంటా.. విశాఖ నార్త్‌కు మారారు. ఇద్దరూ గెలిచినా.. నాటి సీటు పంచాయతీ.. ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఎన్నికలు ముగిశాక కూడా వార్‌ కొనసాగింది. భీమిలి పరిధిలోని తన గెస్ట్‌హౌస్‌.. అక్రమ కట్టడమని.. కూల్చివేస్తామంటూ GVMC అధికారులు నోటీస్‌ ఇవ్వడం వెనుక.. అవంతి హస్తం ఉందని గంటా అనుమానం. దీంతో.. అవంతిని తాను మంత్రిగానే భావించడం లేదంటూ ఆయన కామెంట్ చేశారు.

గంటా సెటైర్‌ గట్టిగా తాకడంతో అవంతి వార్నింగ్‌ ఇచ్చారు. టీడీపీలో గంటా తన గురువైన అయ్యన్నపాత్రుడిని అణగదొక్కినట్టే.. చంద్రబాబును సైతం మోసం చేస్తారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై గంటా ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story