కులభూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట..

కులభూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట..

పాకిస్థాన్‌ జైల్లో ఉన్న కులభూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఎట్టకేలకు భారత దౌత్యావేత్తలు కుల్‌భూషణ్‌ను కలుసుకున్నారు. పాకిస్థాన్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా, కుల్‌భూషణ్‌ను కలిశారు. దాదాపు గంట పాటు కుల్‌భూషణ్‌తో మాట్లాడినట్లు సమాచారం. కుల్‌భూషణ్‌ ఆరోగ్య పరిస్థితిని ఆహ్లూవాలి యా అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందిస్తున్న ఆహారం, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, దేశం యావత్తూ మీ వెంటే ఉందని భరోసా ఇచ్చారు.

కుల్‌భూషణ్‌ను భారతీయ అధికారులు కలవడం 2017 తర్వాత ఇదే మొదటి సారి. ఇది కూడా అంతర్జా తీయ న్యాయస్థానం పాకిస్థాన్‌కు మొట్టికాయలు వేయడం వల్ల సాధ్య మైంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ గౌరవించడం లేద ని, కుల్‌భూషణ్‌ను కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడం లేదని భారత ప్రభుత్వం ఇంటర్నేష నల్ కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఐసీజే, కుల్‌భూషణ్‌ను కాన్సులర్ యాక్సెస్ ఇవ్వా లని ఆదేశించింది. ఐసీజే ఆదేశా లపై పాక్ ప్రభుత్వం తొలుత వితండ వాదన చేసింది. షరతులతో కూడిన అనుమతి ఇస్తామని ప్రతిపాదించింది. నిబంధనలంటూ వివాదం చేయవద్దని భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది. కాన్సులర్ ఆక్సెస్‌పై ఇరు దేశాలు ఓ అంగీకారానికి రాకపోవడంతో కుల్‌భూషణ్‌తో మీటింగ్‌పై ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి ఇమ్రాన్ ఖాన్ సర్కారు వెనక్కి తగ్గింది. జాదవ్‌ను కలవడానికి భారత దౌత్యవేత్తలను అనుమతిస్తా మని, ఎలాంటి షరతులు విధించబోమని తెలిపింది. దాంతో భారత డిప్యూటీ హైకమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా, కుల్‌భూషణ్‌తో సమావేశమయ్యారు.

కుల్‌భూషణ్‌ను గతంలో ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. అరెస్టు-ఉరిశిక్ష తీర్పు తర్వాత ఈ భేటీ జరిగింది. ఆ సమయంలో కుల్‌భూషణ్ కుటుంబసభ్యలుతో పాక్ అధి కారులు అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

కుల్‌భూషణ్‌ను గూఢచర్యం ఆరోపణలపై పాక్ సైన్యం అరెస్టు చేసింది. అనంతరం రావల్పిండిలోని సైనిక కోర్టు, కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, జాదవ్ ఉరిశిక్షపై స్టే విధించింది. జాదవ్ కేసులో మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story