Top

నా జోలికి వస్తే విశాఖలో లేకుండా చేస్తా : మంత్రి అవంతి

నా జోలికి వస్తే విశాఖలో లేకుండా చేస్తా : మంత్రి అవంతి
X

కొద్ది రోజులుగా విశాఖలో మాజీ మంత్రి గంటాకు, మంత్రి అవంతి శ్రీనివాస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విభేదాలు ముదిరాయి. తాను అసలు అవంతిని మంత్రిగానే చూడడం లేదని గంటా అన్నారు. తాను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎలాంటి చాటుమాటు వ్యవహారాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు.

దీనికి అవంతి శ్రీనివాస్ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. గంటా భూకబ్జాకోరు, నమ్మిన వాళ్లనే మోసం చేసే వ్యక్తి అంటూ విమర్శించారు. తన జోలికి వస్తే విశాఖలో లేకుండా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈపరిణామాలు రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేశాయి.

Next Story

RELATED STORIES