విశాఖలో వెలుగుచూసిన మరో ఆన్‌లైన్‌ దోపిడీ

విశాఖలో వెలుగుచూసిన మరో ఆన్‌లైన్‌ దోపిడీ

విశాఖలో ఆన్‌లైన్‌ చీటింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షలతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్‌ బిజినెస్‌ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం వేసింది. అనుమానం వచ్చిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

మెండోలిల్‌ జ్యువెలరీ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో చైన్‌ లింక్‌ బిజినెస్‌ చేసే గుర్గావ్‌ ముఠా ఓ హోటల్‌లో మకాం వేసింది. ఆన్‌లైన్‌ ద్వారా తమ కంపెనీలో సభ్యులుగా చేరేవారికి నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశ చూపారు. ముందుగా 11 వేల నగదుతోపాటు జీఎస్టీ కింద 3 వందలు కట్టాలన్నది స్కీమ్‌. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతినెలా 550 రూపాయలు , ఒక గోల్డ్‌ కాయిన్‌‌ను ఆఫర్‌ చేశారు. దీంతో చాలా మంది ఆసక్తి చూపారు. హోటల్‌కు పెద్ద ఎత్తున జనాలు రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెయిడ్‌ చేసి అందరినీ అదుపులో తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story