వేశ్యను పెళ్ళి చేసుకుంటానని.. తర్వాత ఆమెను..

వేశ్యను పెళ్ళి చేసుకుంటానని.. తర్వాత ఆమెను..
X

ఓ వేశ్యను పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేసిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన అభ్యర్ధనను ఆమె తిరస్కరించడంతో హత్య చేసి పరారయ్యాడు. .ఢిల్లీకి చెందిన మహ్మద్ అయూబ్‌ ఇటీవలే ఓ వేశ్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోమంటూ ఆమెను వేధించటం మెుదలుపెట్టాడు. అప్పటికే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయూబ్ అభ్యర్ధనను ఆ మహిళ తిరస్కరించింది. అయినప్పటి తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. దీంతో మహిళపై పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. ఆగస్టు 20న అయూబ్ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్యప్రదేశానికి చేరుకుని... ఆమెను గొంతుకోసి చంపేశాడు. ఆ తరువాత శరీరాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి మురికి కాలువలో పడేశాడు. శరీరభాగాలు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పది రోజుల తరువాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES