గదిలో నిర్భంధించి.. ఎస్‌ఐ పలుసార్లు అత్యాచారం చేశాడు : బాధితురాలు

గదిలో నిర్భంధించి.. ఎస్‌ఐ పలుసార్లు అత్యాచారం చేశాడు  : బాధితురాలు
X

పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజిగూడెం ఎస్‌ఐ లంకా రాజేష్‌పై అత్యాచార ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎస్‌ఐ రాజేష్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఏలూరు మహిళ పోలీస్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తనను నిర్భంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లంకా రాజేష్‌పై అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు.

వరంగల్‌ జిల్లా మంగపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. ఎస్‌ఐ రాజేష్‌కు కొన్ని రోజుల క్రితం మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా పరిచయమైంది. కొంత కాలం ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో రాజేష్‌ తనను ఇంటికి పిలిపించుకుని రెండు రోజుల పాటు గదిలో నిర్భధించి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు స్నానం చేస్తుండగా వీడియో, ఫొటోలు తీశాడని తెలిపింది.

ఎట్టకేలకు రాజేష్‌ చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతిని నిర్భంధించినప్పుడు గదికి కాపలాగా ఉండి.. ఎస్‌ఐ రాజేష్‌కు సహకరించిన ప్రవీణ్‌ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES