సంతకు వెళ్లి.. తిరిగిరాని ఇద్దరు మహిళలు

సంత నుంచి సరుకులు తెస్తామని ఇంట్లో చెప్పి వెళ్లిన ఇద్దరు గిరిజన మహిళలు వారం గడిచినా ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వాకబు చేసిన భర్తలు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పెద్ద నర్సింగపేటలో జరిగింది.
మడకం చుక్కమ్మ, అనిత అనే ఇద్దరు వివాహిత అక్కా చెల్లెళ్లు సంతకు వెళుతున్నామని వెళ్లి అదృశ్యమయ్యారు. చుక్కమ్మకు పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెంకట్రావుతో వివాహంకాగా, చెల్లెలు అనితకు 6 నెలల క్రితం పెళ్లయింది. పిల్లలను ఇంటివద్దే ఉంచి సంతకు వెళ్లారు. తమ భార్యలు ఏమయ్యారోనని భర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వారం రోజులుగా తల్లులు కనిపించకపోవడంతో పిల్లలు కలత చెందుతున్నారు. ఇద్దరి భర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. సెల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com