ముంచుకొస్తున్న మహా విపత్తు.. ఆందోళనలో ప్రజలు

అమెరికాలో డొరియన్ హరికెన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా సమీపంలోని బహమాస్ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 220 కిలోమీట్ల వేగంతో గాలులు వీయడంతో ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. తుపాన్ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మృతుల వివరాలను బహమాస్ ప్రధాని హుబర్ట్ మిన్నిస్ నిర్దారించారు.. దాదాపు 13వేల ఇళ్లు పూర్తిగా ద్వంసమయ్యాయని, వేలాది నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోస్టుగార్డు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. డొరియన్ హరికెన్ మరికొన్ని గంటల్లో ప్లోరిడాను తాకనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సహాయక చర్యలకు సిద్దమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com