తల్లిని చంపిన కొడుకు

తల్లిని చంపిన కొడుకు
X

మద్యానికి బానిసై కన్నతల్లినే కడతేర్చాడో దుర్మార్గుడు. తాగటానికి డబ్బులు ఇవ్వలేదని అర్ధరాత్రి కర్రతో దాడి చేశాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబానికి చేదోడుగా నిలబడాల్సిన పెద్దకుమారుడు వేణు జులాయిగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి 15 వందలు తీసుకెళ్లి జల్సా చేసి వచ్చాడు. రాత్రి మళ్లీ డబ్బులు కావాలని అడగటంతో తల్లి సుశీల లేవు అని చెప్పింది. దీంతో పశువులా మారిన వేణు తల్లిని కర్రతో కొట్టాడు. అమె అక్కడికక్కడే మృతి చెందటంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Next Story

RELATED STORIES