అంబానీ ఇంట సంబరాలు.. అదిరిపోయే ఆహ్వానపత్రికలు..

అంబానీ ఇంట సంబరాలు.. అదిరిపోయే ఆహ్వానపత్రికలు..
X

ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయకచవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కూతురు, కొడుకు పెళ్లిళ్లు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇరు జంటలకు ఇదే మొదటి వినాయకచవితి. దాంతో ఈ సంబరాలను అత్యంత ఆనందంగా జరుపుకోవాలని భావించారు అంబానీ దంపతులు. ఇందుకోసం వేడుకల్లో పాలు పంచుకునేందుకు రమ్మంటూ ఆహ్వాన పత్రికలను సైతం ప్రింట్ చేయించారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే అంబానీ ఇంట హడావిడి మొదలైంది. అత్యంత సన్నిహితులందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. వారంతా గణేష్ ఉత్సవ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక ముంబైలో ఉన్న అంబానీ ఇల్లు ఆంటిలియా కళ్లు చెదిరే విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆహ్వాన పత్రికలను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Next Story

RELATED STORIES