రైలు ప్రయాణీకులకు శుభవార్త.. బెర్త్ కన్ఫామ్ ఈజీగా..

రైలు ప్రయాణీకులకు శుభవార్త.. బెర్త్ కన్ఫామ్ ఈజీగా..
X

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న అతిపెద్ద రవాణా సంస్థ భారతీయ రైల్వే. మరోవైపు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కూడా రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందిస్తోంది. ఇటీవల ఐఆర్‌సిటీసీలో అనేక మార్పులు జరిగాయి. వాటిలో కొన్ని.. బెర్త్ స్టేటస్, పబ్లిక్ రిజర్వేషన్ చార్ట్స్, బయోమెట్రిక్ లింకింగ్.. ఇవన్నీ ప్రయాణీకులకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

1. రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత కూడా బెర్తులు ఏవైనా ఖాళీగా ఉన్నాయో లేదో ప్రయాణీకులు తెలుసుకోవచ్చు. రైలు బయలు దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 30 నిమిషాల ముందు రెండో చార్ట్ ప్రయాణీకుల కోసం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ బెర్త్ ఖాళీగా ఉంటే నేరుగా టీటీఈని కలిసి బెర్త్ అడగొచ్చు. ఆయన బెర్త్ ఉన్నా లేదని చెప్పడానికి అవకాశం లేనేలేదు. రైల్వే సిబ్బందిలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఇండియన్ రైల్వే తీసుకున్న నిర్ణయం ఇది.

2. రైలు బయల్దేరక ముందే కాదు.. కదులుతున్న రైల్లో కూడా బెర్త్ ఖాళీగా ఉందో లేదో తెలుసుకునే పద్దతి హ్యాండ్ టెర్మినల్-HHT ద్వారా సాధ్యమవుతుంది. దీని ద్వారా ఏవైనా ఖాళీలు ఉంటే వాటిని ప్రయాణీకులకు కేటాయించొచ్చు. సోర్స్ చార్ట్స్, కరెంట్ బుకింగ్ లిస్ట్‌ని జీపీఆర్‌ఎస్ ద్వారా హ్యాండ్ హెల్డ్ టెర్మినల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటారు. దాంతో పాటు రైలు లొకేషన్స్‌లోని చార్ట్స్ కూడా డౌన్‌లోడ్ చేస్తారు. రైలు బయల్దేరిన తరువాత ప్రతీ గంటకు క్యాన్సిల్డ్ ప్యాసింజర్ల జాబితాను తీసుకుంటారు. HHT లో ఏ కోచ్‌లో ప్రయాణించే ప్యాసింజర్ అటెండెన్స్ అయినా మార్క్ చేయొచ్చు. ఏదైనా బెర్త్ ఖాళీగా ఉందని తెలిస్తే ఆ తరువాతి స్టేషన్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. వారికి బెర్త్ కేటాయిస్తారు. ఈ కొత్త డివైజ్‌లతో పేపర్ చార్టుల స్థానంలో ఇ-చార్టులు ఉంటాయి.

3. జనరల్ టికెట్లు కొనేవారు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రల్ని స్కాన్ చేయిస్తే ఓ టోకెన్ లభిస్తుంది. రైలు వచ్చినప్పుడు తమ దగ్గరున్న టోకెన్ నెంబర్ ఆధారంగా క్యూలో నిలబడాలి. దాని ఆధారంగానే జనరల్ బోగీలో సీట్లు లభిస్తాయి. ఎవరూ వచ్చి మీ సీటుని ఆక్యుపై చేసుకోవడానికి వుండదు.

4.గతంలో టికెట్ బుక్ చేసుకుంటే బెర్త్ కన్ఫామ్ అవుతుందో లేదో అని ఓ డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ఫీచర్‌తో మీ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఎంత మేర ఉందో తెలుసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేదానికన్నా ముందే ఈ విషయం తెలిసిపోతుంది. వెయిటింగ్ లిస్ట్ చూసినప్పుడు CNF Probability పైన క్లిక్ చేస్తే మీకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. టికెట్ కన్ఫామ్ అయ్యే విషయం 30 శాతం కన్నా తక్కువ వుంటే టికెట్ బుక్ చేసుకోకపోవడమే మంచిది.

5. ఒకోసారి ప్రయాణీకులు గమ్యస్థానం చేరుకునేందుకు రెండు మూడు రైళ్లు మారాల్సి వస్తుంది. ఎక్కిన ట్రైన్ సమయానికి వెళితే ఇబ్బంది లేదు. కానీ మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి ట్రైన్ లేటయినా, మిస్ అయినా మరో ట్రైన్ కోసం బుక్ చేసుకున్న టికెట్ డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే దీన్ని అరికట్టేందుకు భారతీయ రైల్వే పీఎన్‌ఆర్ లింకింగ్ ఫీచర్ తీసుకువచ్చింది. కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నట్లైతే వాటి పిఎన్‌ఆర్ నెంబర్లను లింక్ చేయాలి. మొదటి రైలు ఆలస్యం కారణంగా రెండో రైలు మిస్ అయితే రీఫండ్ పొందొచ్చు.

Next Story

RELATED STORIES