కోళ్లు కూడా మనుషుల్ని పొడిచి పొడిచి చంపేస్తున్నాయి..

కోళ్లు కూడా మనుషుల్ని పొడిచి పొడిచి చంపేస్తున్నాయి..

పెట్స్‌ని పెంచుకోవచ్చు. ప్రేమించొచ్చు. కానీ అతి గారాబం చేస్తే పిల్లలెలా చెడిపోతారో.. పెట్స్ కూడా అలానే చేస్తాయేమో అనిపిస్తుంది ఇది చూస్తే. ఈ పెట్.. కుక్కపిల్లో.. పిల్లి పిల్లో కాదు. కోడిపెట్ట.. తన ఓనర్ ప్రాణాలు తీసింది.. పొడిచి పొడిచి చంపేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 75 సంవత్సరాల మహిళ కొంతకాలంగా ఓ కోడిని పెంచుకుంటోంది. ప్రతి రోజూ ఆ కోడి గుడ్డు పెడుతుంటుంది. రోజూ ఆమె ఆ గుడ్డును అమ్మేయడమో, తినడమో చేసేది. ఇదిలా ఉండగా ఓ రోజు కోడి ఆమెపై తీవ్రంగా దాడి చేసింది. తన పదునైన ముక్కుతో ఇష్టం వచ్చినట్లు పొడిచి యజమానిని గాయపరిచింది. దాంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయింది.

ఒంటరిగా ఉన్న ఆమెను సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్లేవారు లేక అస్వస్థతకు గురైంది. ఇరుగు పొరుగు వారు ఆమె పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా లాభం లేకపోయింది చికిత్స పొందుతూ మరణించింది. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులు అధ్యయనం చేశారు. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులను, చిన్నపిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఒక్కోసారి పెట్స్ గీరినప్పుడు చిన్న చిన్న గాట్లు పడినా కొద్ది రోజులకు అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులు, పక్షులతో జాగ్రత్తగా ఉండడం మంచిదని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story