దేవుడిని గాలికి వదిలేసి అమ్మాయిలతో అసభ్యకరంగా డ్యాన్సులు

దేవుడిని గాలికి వదిలేసి అమ్మాయిలతో అసభ్యకరంగా డ్యాన్సులు

వినాయక చవితి మండపాల్లో రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. ఉదయాన్నే గణపతికి పూజ చేసి ఓ పనైపోయిందనిపించిన కుర్రాళ్లు.. సాయంత్రం రింగరింగా డ్యాన్సులు ప్లాన్‌ చేశారు. మండపం పక్కనే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలతో డాన్సులు వేయించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో ఈ ఘటన జరిగింది. ఐతే.. ఈ రికార్డింగ్ డాన్స్‌పై పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జోగింపేటలో అర్థరాత్రి దాటేవరకూ ఈ అసభ్యకర నృత్యాలు, గానాబజానా కొనసాగింది. నవరాత్రుల్లో ఇలాంటి పాడుపనులేంటని ఊళ్లో పెద్దలు అభ్యంతరం తెలిపినా.. కుర్రాళ్లు పట్టించుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story