ఐదు శాతం అంటే ఏంటో తెలుసా? : చిదంబరం

ఐదు శాతం అంటే ఏంటో తెలుసా? : చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా 300 కోట్ల రూపాయల కుంభకోణంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ మరో రెండు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. చిదంబరంను తిహార్‌ జైలుకు పంపకుండా, గృహ నిర్బంధంలోనే ఉంచి విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఆయనకు తాత్కలిక ఉపశమనం లభించింది.

మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతవరకు ఆయన్ను సీబీఐ కస్టడీలోనే కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలనే ట్రయల్ కోర్టు ప్రస్తావించింది. గురువారం వరకు సీబీఐ కస్టడీలో ఉండాలని చిదంబరానికి సూచించింది.

అంతకుముందు సీబీఐ కస్టడీని దాఖలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. చిదంబరాన్ని కస్టడీకి పంపి 12 రోజులు గడిచాయని, ఇప్ప టికైనా బెయిల్ ఇవ్వాలని కపిల్ సిబల్ కోరారు. కావాలంటే చిదంబరాన్ని హౌస్ అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే, బెయిల్ కోసం చిదంబరం తరఫు న్యాయవాదులు, ట్రయల్ కోర్టుపై ఒత్తిడి తెస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. బెయిల్ పిటిషన్‌పై ఒక్కరోజులోనే విచారణ పూర్తి చేయాలంటూ ప్రెజర్ పెడుతు న్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కోర్టు, ఇది మంచి పద్దతి కాదని చిదంబరం లాయర్లను మందలించింది.

చిదంబరం కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం అంటే ఏమిటో మీకు తెలుసా? అని సెటైర్‌ వేస్తూ కనిపించారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం తన చేతిలోని ఐదు వేళ్లను చూపారు.

Tags

Read MoreRead Less
Next Story