రెండేళ్ల పాపను అమ్మకానికి పెట్టిన..

రెండేళ్ల పాపను అమ్మకానికి పెట్టిన..

రెండు నెలల క్రితం అపహరణకు గురైన చిన్నారిని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పోతురాజు,లక్ష్మీ దంపతుల రెండేళ్ల కుమార్తె నూకాలమ్మను శ్రీకాళ హస్తికి చెందిన ఆదెమ్మఅనే బిచ్చగత్తె అపహరించి రేణిగుంటకు చెందిన సోది చెప్పుకునే మహిళలకు విక్రయించింది. అప్పటి నుంచి చిన్నారి తల్లిదండ్రులు అపహరణకు గురైన తమ బిడ్డ కోసం రెండు నెలల పాటు శోధించారు. చిత్తూరు అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ చొరవతో రెండు నెలల తరువాత క్షేమంగా చిన్నారి నూకాలమ్మ.. తల్లిదండ్రుల ఒడికి చేరింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పోతురాజు,లక్ష్మి దంపతులు కూలి చేసుకుంటూ జీవించేవారు. వీరికి నూకాలమ్మ అనే రెండేళ్ళ కూతురు ఉంది. అయితే.. శ్రీకాళహస్తికి చెందిన ఆదెమ్మ రైళ్లలో అడుక్కుంటూ తెనాలి రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో సంచరించేది. ఈ క్రమంలో తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసించే పోతురాజు దంపతులతో ఆదెమ్మ పరిచయం పెంచుకుంది. ఓరోజు రాత్రివేళ పోతురాజు దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఆదెమ్మ వారి పాప నూకాలమ్మను అపహరించి నెల్లూరు జిల్లా నాయుడిపేటకు తీసుకు వచ్చి విక్రయానికి పెట్టింది. రేణిగుంట మండలం కొత్తపాలెంకు చెందిన రమణమ్మ,రాములమ్మ అనే సోది చెప్పుకునే మహిళలు పాపను కొనుక్కున్నారు. అపహరణకు గురైన తమ పాప కోసం పోతురాజు దంపతులు రెండు నెలల పాటు వెతికారు. ఎట్టకేలకు చిత్తూరు అర్బన్‌ పోలీసులు పాప జాడ కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

Tags

Read MoreRead Less
Next Story