వందరోజుల్లో 499 దౌర్జన్యాలు చేశారు - చంద్రబాబు

వందరోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారాయన. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం నేత దొన్న దొర, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. పార్టీకి పెద్ద బలం కార్యకర్తలేనన్న చంద్రబాబు.. అరకులో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అంతా సమష్టిగా కష్టపడదామన్నారు.

వందరోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం.. 499 దౌర్జన్యాలు చేసి 8 మంది టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకుందని విమర్శించారు చంద్రబాబు. పెన్షన్‌ 200 రూపాయల నుంచి 2 వేల రూపాయలకు పెంచిన ఘనత టీడీపీదేనన్నారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కేవలం 250 రూపాయలే పెంచిందని గుర్తు చేశారు.

రాష్ట్ర అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలనే వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇసుక మాఫియాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు డాన్‌లుగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు చంద్రబాబు. ఇసుకను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తరలించి.. రాష్ట్ర ప్రజల నోట్లో మట్టికొడుతున్నారన్నారు. పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెడితే మీకెందుకంత కడపుమంట అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story