చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం..

చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం..
X

చంద్రయాన్‌-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్‌ ల్యాండర్ ఆర్బిటర్‌ నుంచి విడిపోయే రెండో కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ ను విజయవంతంగా వేరు చేసిన ఇస్రో.. ల్యాండర్ ఆర్బిట్‌ను ఇంకాస్త తగ్గించింది. తెల్లవారుజామున మూడు గంటల 42 నిమిషాల సమయంలో ఈ ప్రాసెస్‌ పూర్తి చేశారు. కేవలం 9 సెకెన్లలోనే శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ముగించగలిగారు. దీంతో చంద్రయాన్-2 మిషన్‌ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది.

ఆన్ బోర్డు ప్రాపల్షన్ సిస్టమ్ ఉపయోగించి.. నిన్న ఉదయం 8 గంటల 50 నిమిషాలకు విజయవంతంగా ల్యాండర్ ఆర్బిట్ ను తగ్గించారు శాస్త్రవేత్తలు. కేవలం నాలుగు సెకన్లలోనే ఈ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం చంద్రయాన్-2 35 X 101 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి చేరింది. ఇక చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం ఈనెల 7వ తేదీన జరుగుతుంది. ఆ రోజున విక్రమ్ ల్యాండర్, జాబిలిపై ల్యాండవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండైన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. ఈ ప్రక్రియను ప్రధానంమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించనున్నారు. ఇస్రో కంట్రోల్‌ రూమ్ నుంచి శాస్త్రవేత్తలతో కలసి విక్రమ్ ల్యాండింగ్‌ను మోదీ వీక్షించనున్నారు.

జూలై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూకక్ష్యలో పరిభ్రమించి ఆగస్ట్‌20న చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా కక్ష్యని శాస్త్రవేత్తలు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియతో చంద్రయాన్‌-2 అత్యంత కీలక దశను ఇంకాస్త విజయవంతంగా పూర్తిచేయగలిగింది.

Next Story

RELATED STORIES