తాజా వార్తలు

వినాయకుడి నిమజ్జనోత్సవంలో అందాలతార తీన్ మార్ డాన్స్

వినాయకుడి నిమజ్జనోత్సవంలో అందాలతార  తీన్ మార్ డాన్స్
X

గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా... అంటూ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు బాలీవుడ్ తారలు. గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తన భర్త, చెల్లెలు షమితా శెట్టితో కలిసి వినాయకుడి నిమజ్జనోత్సవంలో శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా తీన్ మార్ డాన్స్ చేశారు. కోలాటల మధ్య భక్తులతో కలిసి డాన్స్‌ చేస్తూ అలరించారు. ప్రతి ఏటా అభిమానుల మధ్య వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటామని చెప్పారు.

అటు కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖాన్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. తన మేనల్లుడిని ఎత్తుకుని గణనాధునికి సల్మాన్ ఖాన్‌ ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గణపతి నిమజ్జన వేడుకల్లో సల్మాన్ తీన్మార్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Next Story

RELATED STORIES