స్నేహితుడి ఎదుగుదల చూసి ఓర్వలేక..

స్నేహితుడి ఎదుగుదల చూసి ఓర్వలేక..
X

స్నేహితుడంటే ఆపదలో ఆదుకునేవాడు! జీవితంలో అడుగడునా వెన్నంటి ఉండి తోటి మిత్రుడి ఎదుగుదలకు తోడ్పడేవాడే ! కానీ.. ఆ స్నేహానికి ఇప్పుడు అర్థమే మారిపోతోంది. మిత్రుడి ఎదుగుదల చూసి ఓర్వలేని ఓ స్నేహితుడు శత్రువుగా మారాడు. అతని ఎదుగుదలకు అడ్డం పడాలని ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ ఘటన శంషాబాద్‌లో జరిగింది.

వరంగల్‌కు చెందిన శశికాంత్‌, సాయిరాం ఇద్దరూ ప్రాణా స్నేహితులు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అదృష్టం కలిసిరావడంతో.. సాయిరాం కెనడాలో ఉద్యోగం వచ్చింది. వీసా కూడా రావడంతో కెనెడా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు సాయిరాం. ఇందుకోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే.. సాయిరాం ఎదుగుదలను ఓర్వలేకపోయాడు శశికాంత్‌. ఎలాగైనా అతని కెరీర్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సాయిరాం మెయిల్‌ ఐడితో.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను బాంబుతో పేల్చేస్తామని మేస్సేజ్‌ పంపాడు.

ఈ మెస్సేజ్‌తో అలర్టైన భద్రతా సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన శంషాబాద్‌ పోలీసులు .. ముందుగా సాయిరాంను అదుపులో తీసుకున్నాడు. ఆ తర్వాత సమగ్రవిచారణ జరిపి నిందితుడు శశికాంత్‌ను అదుపులో తీసుకున్నాడు. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేవలం స్నేహితుడి ఎదుగుదల చూసి ఓర్వలేకనే శశికాంత్‌ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES