సంచలన నిర్ణయం తీసుకున్న'మహా' ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో భారీ..

సంచలన నిర్ణయం తీసుకున్నమహా ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో భారీ..

మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులపై సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాశ్మీర్‌లో రెండు రిసార్ట్స్ లను నిర్మిస్తామని ఎంటీడీసీ ఇప్పటికే ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడులు పెడుతున్న తొలి సర్కారుగా మహారాష్ట్ర ప్రభుత్వం రికార్డును సొంతం చేసుకోబోతోంది.

రిసార్ట్స్ నిర్మాణం కోసం ల్యాండ్ సర్వే చేయాలని ఇప్పటికే ఎంటీడీసీ ని ఆదేశించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్. ఆర్టికల్ 370 అమలులో ఉన్నప్పుడు కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల ప్రజలకు భూములు కొనటానికి వీల్లేకుండా పోయింది. కాని పార్లమెంట్.. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో పాటు కశ్మీర్ ను విభజించింది. దీంతో ఇప్పుడు పెట్టుబడులు వెల్లువలా వచ్చేలా కనిపిస్తోంది..

భారతదేశం నలుమూలల నుంచి జమ్మూ కాశ్మీర్ లో భూములు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లో టూరిజం విస్తరించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. కాశ్మీర్ కు భూతల స్వర్గంగా పేరుంది. దీనిలో భాగంగా అక్కడ రిసార్ట్స్ ను స్టార్ట్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story