మహేష్, బన్నీల హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?

మహేష్, బన్నీల హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?
X

2016లో కిరాక్ పార్టీతో కన్నడలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ చిత్రంతోనే కన్నడలో స్టార్ గా మారింది. ఇక గీతగోవిందంతో తెలుగులోనూ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. అది కూడా స్టార్ హీరోల నుంచి. ప్రస్తుతం రష్మిక, మహేష్ కి జోడీగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీలోనూ రష్మికే హీరోయిన్. అలాగే భీష్మ చిత్రంలో నితిన్ కి జోడీగా నటిస్తోంది.

తెలుగు, కన్నడలో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో నాని హీరోగా చేసిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు కరణ్ జోహార్. అందులో షాహిద్ కపూర్ హీరో. అతనికి జోడీగా రష్మిక నటించబోతోంది. కరణ్ జోహార్ రష్మికని ఫిక్స్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రష్మిక గోల్డెన్ ఆఫర్ కొట్టేసినట్లే.

Next Story

RELATED STORIES