దసరా బరిలో 'సైరా'.. పోటీ తప్పదా..?

దసరా బరిలో సైరా.. పోటీ తప్పదా..?

దసరా సీజన్ టాలీవుడ్ కి చాలా ఇంపార్టెంట్. దేవీ నవరాత్రుల హాలీడేస్‌ని క్యాష్ చేసుకోడానికి ప్రతి ఏడాది పెద్ద హీరోలే పోటీ పడేవారు. కానీ ఈ సారి మాత్రం బరిలో దిగుతున్న పెద్ద హీరో మెగాస్టార్ ఒక్కడే. చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా దసరా కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సైరా నరసింహారెడ్డి సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడుగా చెప్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచాయి. చిరంజీవితో పాటు నయనతార, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు పోషించడం వల్ల ఆయా బాషల్లో సైరాపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది.

అయితే నిన్న మొన్నటి వరకు ఈ దసరా సీజన్లో సైరాకి పోటీ లేదనుకున్నాం. కానీ రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ చిత్రం సైరాతో పోటీ పడుతున్నాయి. పది రోజులు హాలిడేస్ కారణంగా ఈ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు సైరాతో పోటీకి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలే గోపిచంద్ నటిస్తున్న 'చాణక్య', 'రాజుగారి గది3' చిత్రాలతో పాటు బాలీవుడ్ డబ్బింగ్ మూవీ 'వార్' ఈ దసరాకే రిలీజ్ అవుతున్నాయి.

దసరా సీజన్లోనే తెలుగులో సైరాతో పాటు వస్తున్న సినిమాల్లో గోపిచంద్ చాణక్య ఒకటి. మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరు దర్శకుడు. మెహ్రీన్ గోపిచంద్ కి జోడీగా నటిస్తోంది. ఇండో పాకిస్తాన్ బోర్డర్లో వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ అంటున్నారు. ఈ సినిమా మీద గోపిచంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక దీంతో పాటు ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గదికి మరో సీక్వెల్ పార్ట్ 3 రాబోతుంది. ఈ సినిమాలో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంటే తమన్నా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. చాణక్య, రాజుగారి గది3 అక్టోబర్ 4 లేదా 5న రిలీజ్ అవుతాయి.

ఇక బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ చిత్రం వస్తోంది. యాక్షన్ ఎపిసోడ్సే హైలైట్ గా తెరకెక్కిన వార్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా వల్ల సైరాకి సంబంధించి, ఒక్క హిందీలో మాత్రమే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. మిగతా సినిమాలు చాణక్య, రాజుగారి గది3 వల్ల కూడా తెలుగులో సైరాకి ఇబ్బందులు లేవు. దసరా హాలిడేస్ 10 రోజులకు పైగానే ఉంటాయి కాబట్టి, ఇబ్బంది ఉండదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Tags

Read MoreRead Less
Next Story