ఇదెక్కడి గొడవ.. రూ.17వేలు ఫైనా.. నెత్తీ నోరు బాదుకుంటున్న టూ వీలర్

ఇదెక్కడి గొడవ.. రూ.17వేలు ఫైనా.. నెత్తీ నోరు బాదుకుంటున్న టూ వీలర్
X

కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే బండి తీయాలి.. లేదంటే జేబుకి చిల్లే. లేదంటే ఫైన్లు కట్టలేక బండి అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవాల్సి వస్తుంది అలా ఉన్నాయి మారిన రూల్స్. బెంగళూరుకి చెందిన ఓ టూ వీలర్ వాహన దారుడు ఏకంగా రూ.17 వేలు ఫైన్ కట్టాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 3 ఇష్యూస్‌ కింద రూ.17 వేలు సమర్పించుకున్నాడు. వార్తూరులో నివాసం ఉండే ఆకాష్ ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందులో 1. డ్రంకెన్ డ్రైవ్ కింద రూ.10 వేలు.. 2. లైసెన్స్ లేదని రూ.5 వేలు.. 3. ఆకాష్ బండి మీద వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదన్న కారణంతో రూ.2 వేలు ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చాక బెంగళూరులో ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టిన వ్యక్తిగా ఆకాష్ రికార్డుల్లోకి ఎక్కాడు. ముందు హెల్మెట్ లేదని ఆకాష్‌ని ఆపేశారు. అక్కడి నుంచి ఒక్కొక్కటి అన్నీ తప్పులే కనిపించాయి. మద్యం తాగినట్లు బ్రీత్ అనలైజర్ ద్వారా నిర్ధారించుకున్నారు. సో.. అలా బుక్కయ్యాడు. అందుకే బండి తీసే ముందే అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం.

Next Story

RELATED STORIES