నేనెప్పుడూ ఆమెని అడగలేదు: రాజీవ్ కనకాల

నేనెప్పుడూ ఆమెని అడగలేదు: రాజీవ్ కనకాల
X

బుల్లి తెర స్టార్ యాంకర్ ఎవరంటే టక్కున సుమ పేరు చెప్పేస్తారు నిద్రలో లేపి ఎవరిని అడిగినా. సుమ ఉందంటే ఆ షో నవ్వుల హరివిల్లే. షో అయినా, సినిమా రిలీజ్ ఫంక్షన్ అయినా చలోక్తులతో, గల గలా మాట్లాడుతూ ఆధ్యంతం రక్తి కట్టిస్తుంది. ఆమెకు సాటి మరెవరూ లేరనిపిస్తుంది. ఇన్నేళ్లుగా బుల్లి తెరను ఏలేస్తున్నా సుమ షో అంటే బోరు కొట్టదు ప్రేక్షకులకి. పెద్దవాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ అభిమానులైపోతారు సుమ యాంకరింగ్‌కి. మరి ఆమె రెమ్యునరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందేమో అంత బిజీగా ఉన్న సుమకి. ఎంతో మీకు తెలిసే ఉంటుంది కదా అని సుమ భర్త రాజీవ్ కనకాలని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. రాజీవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుమ రెమ్యునరేషన్ గురించి గానీ, తన సంపాదన గురించి గానీ అసలు పట్టించుకోనని చెప్పారు. అసలు అలాంటి విషయాల్లో తాను జోక్యం చేసుకోనని అన్నారు. సుమ సక్సెస్ ఫుల్ యాంకర్‌గా రాణించడానికి రాజీవ్ సపోర్ట్ వుందని చెప్పడం అది ఆమె గొప్పతనమని అన్నారు. అయితే సుమ తన కెరీర్‌ను కొనసాగించడానికి మాత్రం తన కుటుంబం ఆమెకు కావలసినంత సపోర్ట్ ఇచ్చిందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో దేవదాస్ కనకాలకు ఉన్న ఇమేజ్.. సుమకు తెలియకుండానే ఆమె కెరీర్‌లో ఎదగడానికి ఉపయోగపడిందన్నారు. అన్నిటికీ మించి ఆమె కష్టం, సమయస్ఫూర్తి, తెలివి తేటలు.. ఒకింత అదృష్టం అన్నీ కలిసి వచ్చి సుమని టాప్ యాంకర్ చేశాయని రాజీవ్ అన్నారు.

Next Story

RELATED STORIES