ప్రభాస్ బాలీవుడ్‌లో పాగా వేస్తాడా..?

ప్రభాస్ బాలీవుడ్‌లో పాగా వేస్తాడా..?
X

భారీ అంచనాల మధ్య సాహో గత శుక్రవారం విడుదలైంది. కానీ అన్ని చోట్లా అంచనాలను అందుకోలేకపోయింది. నెగిటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ వీకెండ్ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఎవరూ ఊహించని కలెక్షన్లు సాధించింది. కానీ తెలుగులో ఎక్కువగానూ, మిగతా దక్షిణాది బాషల్లో కాస్త తక్కువగానూ నష్టాలు మాత్రం సాహోకి తప్పవని తేలిపోయింది.

సాహోకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు 350 కోట్ల గ్రాస్ దాటాయి. ఫుల్ రన్ లో 400ల కోట్లకు టచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకు కారణం బాలీవుడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్. ఒక్క బాలీవుడ్‌లోనే ఈ సినిమాకి 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మొదటి 5 రోజులయితే 102 కోట్ల షేర్ సాధించి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది సాహో.

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ బాలీవుడ్‌లో బాగా కలిసొచ్చింది. అక్కడ లోకల్ స్టార్ హీరోకి వచ్చినంతగా ఓపెనింగ్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ లాంటి హీరోలు 100 కోట్లు సాధించడానికి చాలా టైమ్ తీసుకుంటున్న సందర్భంలో, ప్రభాస్ కేవలం 5 రోజుల్లో ఆ ఫీట్ సాధించాడు. అదీ నెగిటివ్ రివ్యూలు వచ్చిన సినిమాతో. దీన్ని బట్టి చూస్తే నార్త్ లో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉందని అర్ధమవుతోంది. ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుని ఒకటి రెండు హిట్లు ఇస్తే.. బాలీవుడ్‌లో పాగా వేయడం అంత కష్టమేం కాదనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ప్రభాస్ ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.

Also Watch :

Next Story

RELATED STORIES