ఫైన్ల మోత.. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ.59 వేలు జరిమానా

ఫైన్ల మోత.. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ.59 వేలు జరిమానా
X

కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టంతో ఫైన్ల మోత మోగుతోంది. ట్రాఫిక్ పోలీసులు నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా హర్యానాలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌కు ఏకంగా రూ. 59 వేల మేరకు జరిమానా విధించారు. అలాగే 10 ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ట్రక్కు డ్రైవర్‌కు భారీ మెుత్తంలో ఫైన్ విధించినట్లుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సదరు ట్రక్కు డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ట్రాన్స్ పోర్టు వాహనానికి సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేవన్నారు. అంతే కాకుండా ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించలేదన్నారు. దీనికి తోడు వాహనంలో ప్రమాదకర వస్తువులను తీసుకువెళుతున్నాడని తెలిపారు. చివరికి డ్రైవింగ్ కూడా సరిగా చేయకపోగా... ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా జంప్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES