ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలపై నితిన్ గడ్కరీ స్పందన

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలపై నితిన్ గడ్కరీ స్పందన
X

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘనలకు భారీ జరిమానాలపై గడ్కరీ స్పందించారు. హెవీ ఫైన్స్‌ విధించాలన్నది ప్రభుత్వ అభిమతం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జరిమానాలు కట్టే పరిస్థితి రాకూడదన్నదే తమ ఆలోచన అని తేల్చి చెప్పారు. పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల నిషేధంపై కూడా మంత్రి స్పందించారు. పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌ను ర‌ద్దు చేయాల‌నే ఆలోచన ప్రభుత్వానికి లేద‌ని చెప్పారు. ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని, చమురుపై ప‌న్నులు త‌గ్గించడంపై దృష్టి సారించామని గడ్కరీ అన్నారు.

Watch Fast News in 3 Minutes :

Next Story

RELATED STORIES