కశ్మీరీ అమ్మాయి ఏం చేయగలదో నిరూపిస్తా: పాకిస్థాన్ సింగర్

కశ్మీరీ అమ్మాయి ఏం చేయగలదో నిరూపిస్తా: పాకిస్థాన్ సింగర్
X

ఆర్టికల్-370 రద్దుపై పాకిస్థానీలు విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో సింగర్ రబీ పిర్జాదా కూడా చేరిపోయింది. ఆమె కూడా ప్రధాని మోదీని బెదిరించే ప్రయత్నం చేసింది. మోదీపై పాములు, కొండచిలువలు, మొసళ్లను ప్రయోగిస్తానని ప్రగల్బాలు పలికింది. మోదీ నరకానికి పోవాల్సిందేనని, కశ్మీరీలను మోదీ హింసిస్తున్నారంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేసింది.

Watch 10 Minutes 50 News :

రబీ పిర్జాదా పాకిస్థాన్‌లో పాప్ సింగర్ కమ్ యాక్టర్. తాజాగా ఆమె ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. తనను తాను కశ్మీరీ అమ్మాయిగా చెప్పుకున్న పిర్జాదా, మోదీ సర్కా ర్‌పై బురదజల్లే ప్రయత్నం చేసింది. చుట్టూ పాములు, కొండచిలువలను పెట్టుకున్న పిర్జాదా, మోదీపై విషసర్పాలను ప్రయోగిస్తానని హెచ్చరించింది. కశ్మీరీ అమ్మాయి ఏం చేయగలదో విషసర్పాల ద్వారా నిరూపిస్తానని సవాల్ చేసింది.

రబీ పిర్జాదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశామని, డ్రామాలు కట్టి పెట్టాలని నెటిజన్లు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.

Tags

Next Story