ఫోటో సెషన్‌లో మోదీ ప్రవర్తనపై నెటిజన్ల ప్రశంసలు

ఫోటో సెషన్‌లో మోదీ ప్రవర్తనపై నెటిజన్ల ప్రశంసలు
X

రష్యా పర్యటనలో భాగంగా అక్కడి ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్‌లో భారత ప్రధాని మోదీ ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో సెషన్‌ సందర్భంగా రష్యా అధికారులు మోదీ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. అయితే దానిలో కూర్చోవడానికి నిరాకరించిన మోదీ.. అందరితో పాటు తాను అని.. ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. మిగతా వారితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్నారు. దాంతో అధికారులు వెంటనే మోదీ కోసం కుర్చీని తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. మోదీ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవంటూ కితాబిస్తున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES