మెహబూబా ముఫ్తీని కలుసుకోవడానికి ఇల్తిజాకు సుప్రీంకోర్టు అనుమతి

మెహబూబా ముఫ్తీని కలుసుకోవడానికి ఇల్తిజాకు సుప్రీంకోర్టు అనుమతి
X

కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. గృహ నిర్బంధంలో ఉన్న తల్లిని కలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. నెల రోజులుగా తన తల్లిని కలుసుకోలేదనీ, ఆమె ఆరోగ్యంపై ఆందోళనగా ఉందంటూ ఇల్తిజా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఐతే, శ్రీనగర్‌లో స్వేచ్ఛగా పర్యటించే విషయంలో స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని కోర్టు ఇల్తిజాకు సూచించింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. దాదాపు నెల రోజులుగా వాళ్లు నిర్బంధంలోనే ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇల్తిజా తీవ్రంగా మండిపడ్డారు. కనీసం తల్లిని కలవడానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. ముఫ్తీని కలుసుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు, నిబంధనలను పాటిస్తూ ముఫ్తీని చూడవచ్చంటూ పర్మిషన్ ఇచ్చింది.

Watch Latest Headlines in 3 Minutes :

ఇక, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తరిగామి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు వెంటనే చికిత్స అందించాలంటూ వామపక్షనేత సీతారాం ఏచూరీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇటీవల సుప్రీంకోర్టు అనుమతితో కశ్మీర్‌కు వెళ్లిన ఏచూరీ, తరిగామిని కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక ఇచ్చారు. పరిశీలించిన ధర్మాసనం, తరిగామిని వెంటనే ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES