సన్నబియ్యం కాదు.. ముక్కిపోయిన బియ్యం పంపిణి..

సన్నబియ్యం కాదు.. ముక్కిపోయిన బియ్యం పంపిణి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అమలులో అభాసుపాలౌతోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని నిర్వహిస్తున్నా... నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. ఇచ్చాపురం, కవిటి మండలాల్లో పలు చోట్ల పురుగులు పట్టిన బియ్యం పంపిణీ కాగా... పొందూరు మండలం కేసదాసుపురంతో పాటు మరికొన్ని చోట్ల తడిసిన బియ్యాన్ని పంపిణీ చేశారు..

ఇంటింటికీ రేషన్ వాలంటీర్ల ద్వారా పంపిణీ అని చెప్పినా అనేక చోట్ల రేషన్‌...‌ కూడళ్లలో వేయడంతో అక్కడి నుంచి తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు లబ్ధిదారులు. సన్నబియ్యం అని మొదట చెప్పి తర్వాత నాణ్యత గల బియ్యం అంటూ మాట మార్చి ఇప్పుడు ముక్కిపోయిన బియ్యం తమకు అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

కొత్త సీసాలో పాతసారా అన్నట్లుగా పాత బియ్యాన్నే.. రంగురంగుల సంచుల్లోకి మార్చారని జనం మండిపడుతున్నారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన దొడ్డు బియ్యమే నయమనుకుంటూ వాపోతున్నారు లబ్ధిదారులు.

Tags

Read MoreRead Less
Next Story