శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ
X

చంద్రయాన్‌ సక్సెస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, సాధించింది తక్కువేమీ కాదన్నారు. భవిష్యత్ పై ఆశావహ దృక్పథంలో ముందుకు సాగుదామని శాస్త్రవేత్తలకు సూచించారు. భవిష్యత్ లో విజయాన్ని అందుకుంటారన్న విశ్వాసం తనకుందన్నారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.

తరువాత.. చంద్రయాన్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వచ్చిన విద్యార్థులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పారు. వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి.. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. తరువాత బెంగళూర్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తిరిగి వెళ్లిపోయారు.

Next Story

RELATED STORIES