హైఅలర్ట్.. పఠాన్‌కోట్ తరహా దాడులకు పాకిస్తాన్‌ కుట్ర ?

హైఅలర్ట్.. పఠాన్‌కోట్ తరహా దాడులకు పాకిస్తాన్‌ కుట్ర ?
X

పఠాన్‌కోట్ తరహా దాడులకు పాకిస్తాన్‌ కుట్ర చేస్తోందా? కేంద్ర నిఘా వర్గాలు భారత వాయుసేనను అప్రమత్తం చేశాయి. ఎయిర్‌బేస్‌లపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందింది. దీంతో తమ దళాలను అప్రమత్తం చేసినట్టు ఎయిర్‌ చీఫ్ మార్షల్ ధనోవా తెలిపారు. భారత వాయుసేన దళాలు అనుక్షణం అప్రమత్తంగా, ఎలాంటి ఉగ్రదాడులైనా ధీటుగా తిప్పికొట్టేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. దేశంలోని అన్ని వైమానిక కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

Also watch :

Tags

Next Story