తాజా వార్తలు

శ్రీరామ్ సాగర్ కు చేరిన కాళేశ్వరం జలాలు

శ్రీరామ్ సాగర్ కు చేరిన కాళేశ్వరం జలాలు
X

నిజామాబాద్ జిల్లాలో మరో చారిత్రక ఘట్టానికి తెరలేచింది. ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరాయి. కొత్త నీరు రాక తో ఆయకట్టు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.

గత కొన్నేళ్లుగా వర్షాలు లేకపోవడం, గోదావరి ఎగువన మహారాష్ట్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని గా పిలిచే శ్రీరామ్ సాగర్ ఎడారిగా మారింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం కోసం రివర్స్ పంపింగ్ కు శ్రీకారం చుట్టింది. సుమారు 12 వందల కోట్ల తో చేపట్టిన ఎత్తిపోతల పనులకు 2017 లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించడానికి రాంపూర్, రాజేశ్వర్ రావు పేట, ముప్కాల్ దగ్గర పంప్ హౌస్ లు నిర్మించారు. ప్రస్తుతం రెండు పంప్ హౌస్ లు పూర్తయ్యాయి. సీజన్ లో 60 రోజుల పాటు రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోయనున్నారు.

గోదావరి జలాలు రావడంపై శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమ్మర్ పల్లి, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ, మెండోరా ముప్ కాల్ గ్రామాల రైతులు వరద నీటికి పూజలు నిర్వహించారు.

Next Story

RELATED STORIES