భర్త సింగపూర్‌లో.. భార్య మరొకరితో.. విషయం తెలిసిన అత్త..

భర్త సింగపూర్‌లో.. భార్య మరొకరితో.. విషయం తెలిసిన అత్త..
X

కోడలి అక్రమ సంబంధం విషయం తెలిసి ప్రియుడిని, ఆమెను సీక్రెట్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించిన అత్తకు ఆ జంట షాక్ ఇచ్చింది. వివాహేతర సంబంధం బయటపెట్టేందుకు యత్నించిన అత్త నుంచి తప్పించుకుని ప్రియుడితో కలిసి కోడలు పరారైంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోవిల్‌పట్టికి చెందిన సులోచనకు సింగపూర్‌లో పనిచేసే మేల్‌నిలై పట్టికి చెందిన ఓ యువకుడితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సింగపూర్‌లో ఉంటూ అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి వెళుతుండేవాడు సులోచన భర్త. వీరికి పిల్లలు కూడా లేరు.

ఈ నేపథ్యంలో సులోచనకు పుదుక్కోటై కట్టియవయల్‌ ప్రాంతానికి చెందిన మాణిక్యంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మాణిక్యం సులోచన దగ్గరకు రాత్రి పూట వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడు. ఈ విషయం సులోచన అత్తకు తెలిసింది. దీంతో కోడలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రియుడితో సులోచన ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి తాళం వేసింది. ఇరుగుపొరుగు వారిని అక్కడికి పిలిచింది. విషయం తెలుసుకున్న వారిద్దరూ ఇంటి వెనుక వైపు నుంచి బైక్‌పై ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమజంట కోసం గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES