పండక్కి పల్లెకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారా!!.. రైళ్లన్నీ ఫుల్లు..

పండక్కి పల్లెకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారా!!.. రైళ్లన్నీ ఫుల్లు..

దసరా పండుగ వచ్చేస్తోంది. అందరూ పల్లె బాట పట్టడానికి పెట్టే బేడా సర్థుకుంటున్నారు. అన్నిటికంటే ముందూ రైలూ, బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవడం చాలా అవసరం. ఈనెల 29వ తేదీ నుంచే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. పిల్లలకి కూడ ఆ సమయానికి పరీక్షలు అయిపోయి స్కూళ్లకు సెలవులు ఇచ్చేస్తారు. ఈ రోజు వీలవదు.. రేపు చూద్దాం అని అశ్రద్ధ చేశారంటే టికెట్ దొరకడం చాలా కష్టం. ఆఫీసులో నాలుగు రోజులు సెలవులు ఇస్తారో లేదో అన్న మీమాంసలో ఉన్నారనుకోండి.. ఈలోపు ఆరోజు రానే వస్తుంది. టికెట్ ‌లేని ప్రయాణం ఎన్ని ఇక్కట్లు తెచ్చి పెడుతుందో ఈ పాటికి మీకు అనుభవం అయ్యే వుంటుంది.

పండగ రోజుల్లో అది మరింత కష్టం. అందుకే ముందు జాగ్రత్త అవసరం. ఇప్పటికే సెలవులు అయిపోయి తిరిగి వెళ్లే రోజులైన అక్టోబర్ 8,9 తేదీల్లో టికెట్లన్నీ బుకింగ్ అయిపోయాయి. కొన్ని రైళ్లలో అయితే వెయిటింగ్ లిస్ట్ 100కి పైగా ఉందంటే రష్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటే సాధారణ రైళ్లను కూడా నడిపే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలులో సెకండ్ సిట్టింగ్ టిక్కెట్లు కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక నరసపూర్, డెల్టా, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో సికింద్రాబాద్ వైపునకు టిక్కెట్లు రిజర్వ్ అయిపోయాయి. నంద్యాల మార్గం వైపు వెళ్లే రైళ్లలోనూ రద్దీ నెలకొన్నది. మరి ఇప్పటికైనా మేలుకొంటే బెర్త్ దొరక్కపోయినా కనీసం సీటైనా దొరుకుతుంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story