కొడుకుతో కలిసి మహిళ వెళ్తుండగా..

కొడుకుతో కలిసి మహిళ వెళ్తుండగా..
X

డబ్బుకోసం ఏమైనా చేస్తారు. ఒంటరిగా వెళ్లే మహిళలే వారి టార్గెట్.. మెడలో గొలుసు కనిపించిందా వదిలే ప్రసక్తి లేదు. గొలుసు కోసం మహిళల ప్రాణాలను కూడా పణంగా పెడతారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకుతో కలిసి వెళుతుండగా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఆమె మెడలోని గొలుసును అమాంతం లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఛావ్లా ప్రాంతానికి చెందిన మహిళ తన కొడుకుతో వెలుతుతోంది. ఎవరు లేని సమయం చూసి ఇద్దరు దుండగులు ఆ ప్రాంతానికి బైక్ మీద వచ్చారు.. మహిళ ముందు ఆపారు. ఇంతలో ఒకతను ఆమె మెడలోని గొలుసును లాక్కుని బైక్ ఎక్కి పరారయ్యారు.

నిస్చేస్టురాలైన మహిళ ఏమి చెయ్యలేక అలాగే ఉండిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారామె. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. వారిని చైన్ స్నాచర్లుగా గుర్తించారు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని వారి మెడలోని గొలుసులను కాజేస్తున్నట్టు తేలింది. ప్రతిఘటించే మహిళల పట్ల వీరు క్రూరంగా ప్రవర్తిస్తారని.. వీరి సమూహం గ్రూపులుగా విడిపోయి ఏరియా వైజ్ గా వెళతారని పోలీసులు గుర్తించారు. నగరంలో ఇలాంటి దుండగులు పదుల సంఖ్యలో ఉన్నట్టు పసిగట్టారు.

Next Story

RELATED STORIES