Top

గ్లాస్ బీరు రూ.71 లక్షల 66 వేలు.. బిల్లు చూసి బ్యార్

గ్లాస్ బీరు రూ.71 లక్షల 66 వేలు.. బిల్లు చూసి బ్యార్
X

మనసైన వారు పక్కన ఉంటే మందు మస్త్ మజాగా ఉంటుందని భావించాడు. గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకుని బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళ్లాడు ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ రైటర్.. పీటర్ లాలర్. ఆదివారం మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ హోటల్‌కు వెళ్లిన పీటర్.. బేరర్‌ని పిలిచి మాంచి బీరేదైనా ఉంటే తీసుకు రమ్మని చెప్పాడు. ఓ అందమైన అమ్మాయి వచ్చి హెలెన్ కెన్ బీరును తీసుకు వచ్చింది. ఇద్దరికీ గ్లాసులో పోసింది. సిప్‌ సిప్‌ని ఎంజాయ్ చేస్తూ తాగారు. బీర్ భలేగా ఉందంటూ మురిసి పోయారు. అంతలోనే బేరర్ బిల్లు తీసుకు వచ్చి చేతిలో పెట్టాడు. బిల్లు చూసి పీటర్ కార్డు తీసి బేరర్ చేతికి ఇచ్చాడు స్వైప్ చేయమని. ఆ తరువాత బేరర్ రిసీప్ట్ తీసుకు వచ్చి ఇచ్చాడు పీటర్‌కి. దాన్ని చూసి పీటర్‌కి గుండె ఆగినంత పనైంది.

ఏంటి బాబు ఇది అని అడిగేలోపు మేనేజర్ అక్కడికి వచ్చాడు. సారీ సర్.. పొరపాటున ఎక్కువ మొత్తం కట్ అయింది. రెండు రోజుల్లో మీ డబ్బుని రీఫండ్ చేస్తామని సమాధానం చెప్పాడు. ఇంతకీ గ్లాస్ బీరుకి బిల్లెంత కట్ అయిందని అనుకుంటున్నారు.. 99, 983.64 డాలర్లు (రూ.71 లక్షల 66 వేలు). ఒక్కసారే అంత పెద్ద మొత్తం బ్యాంకు నుంచి ఎలా కట్టయిందో పీటర్‌కి అస్సలు అర్థం కాలేదు. పీటర్ తనకు జరిగిన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. రెండ్రోజుల్లో వస్తాయనుకున్న డబ్బులు కాస్తా తొమ్మిది రోజులు పట్టింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బీరుని తాగానంటూ పీటర్ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

RELATED STORIES