తాజా వార్తలు

"వెంకీ మామ" బడ్జెట్ ఎంతో తెలుసా?

వెంకీ మామ బడ్జెట్ ఎంతో తెలుసా?
X

రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టిస్టారర్ తెరకెక్కుతోంది. వెంకీ మామ పేరుతో బాబి డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇధ్దరు హీరోలు ఉన్నారు కాబట్టి, నిర్మాత సురేష్ బాబు కాస్త ఎక్కువే ఖర్చు పెడుతున్నాడని తెలుస్తోంది. ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జోడీగా రాశీఖన్నా నటిస్తోంది.

వెంకీమామ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ దీనికి రెండు రోజుల ముందు చిరంజీవి సైరా వస్తుంది. అందుకే పోటీ పడటం ఇష్టం లేక, నిర్మాత సురేష్ బాబు వెంకీమామని అక్టోబర్ 25కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంటే అది దీపావళి సీజన్. కాబట్టి వీకెండ్ తో పాటు పండగ హడావిడి కూడా కలిసొస్తుందనే ఈ డెసిషన్ తీసుకున్నారు. లొకేషన్లు, సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వెంకీమామకి దాదాపు 50 కోట్లు వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మొత్తంగా వెంకీమామపై టాలీవుడ్లో అంచనాలైతే బాగానే ఉన్నాయి.

Next Story

RELATED STORIES