తాజా వార్తలు

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరంటే?

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరంటే?
X

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్‌ సమావేశాల్లో ఆరు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం పొందగా.. ఆ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేసీఆర్‌ సర్కార్‌. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, జీడీపీ వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తోంది.

ఈ బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ కేబినెట్ ఇవాళ సాయంత్రం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలస్తోంది. అయితే.. కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొత్త మంత్రులతో కలుపుకొని రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు, పొందుపర్చాల్సిన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు. కేబినెట్ లో మార్పులు చేర్పుల తర్వాత జరగబోయే ఈ తొలి కేబినెట్ సమాశం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది.

మరోవైపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామన్నారు... ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న అవినీతి, ఎరువుల కొరత, విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు, యాదాద్రిలో కేసీఆర్‌ బొమ్మల రగడ వంటి అంశాల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు భట్టి. మార్పుల తర్వాత జరగబోతున్న తొలి కేబినెట్ భేటీలో విష జ్వరాలు, యూరియా కొరత, యాదాద్రి వివాదం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES