బండి భలే ఉందండి.. మార్కెట్లోకి కొత్తగా.. ఫీచర్లు చూస్తే..

బండి భలే ఉందండి.. మార్కెట్లోకి కొత్తగా.. ఫీచర్లు చూస్తే..

మార్కెట్లోకి మరో బండి వచ్చేస్తోంది. టూ వీలర్‌లలో ఎక్కువగా అమ్ముడయ్యే హోండా యాక్టివా నుంచి కొత్త స్కూటర్ మరో రెండు రోజుల్లో వాహన ప్రియుల కోసం అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలి బీఎస్ (భారత్ స్టేజ్) 6 యాక్టివాను ఈ నెల 11న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ముందైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ బండికి సంబంధించిన పనులన్నీ ముందుగానే పూర్తి అవడంతో ఈనెలలోనే అమ్మకాలకు సిద్ధంగా ఉంచుతునట్లు తెలిపారు.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా యాక్టివా 125 ఎఫ్‌ఐ‌లో బీఎస్-4 యాక్టివాలో ఉన్న ఫీచర్లకు అదనంగా 26 హంగులు జోడించారు. 125 సీసీ సిలిండర్ ఇంజిన్‌కు చెం ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎన్‌హాన్స్డ్ స్మార్ట్ పవర్‌ను జత చేశారు. బండి ముందుభాగం, హెడ్‌లైట్లు, సైడ్ ప్యానెళ్లలో కూడా డిజైన్ మార్చారు. ఈ బండికి ఉన్న మరో స్పెషాలిటీ.. సైడ్ స్టాండు వేసి ఉంటే ఇంజిన్ ఆన్ కాదు. ఇంధన పొదుపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంధనం వివరాలు, స్పీడో మీటర్, ఒడోమీటర్ వంటివి యథావిధిగా ఉన్నాయి. ధర బీఎస్‌-4తో పోలిస్తే 15 శాతం ఎక్కువ. అంటే దాదాపు రూ.70 వేల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story