వివాహిత అనుమానాస్పద మృతి

X
TV5 Telugu9 Sep 2019 6:46 AM GMT
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాతూరులో నివాసముంటున్న ప్రసన్న కుమారి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. ప్రసన్నకుమారికి... ప్రేమసాగర్‌కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవలే ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో ప్రసన్న కుమారి పుట్టింటికి వచ్చింది. ప్రసన్నకుమారి తల్లి ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పొరుగురికి వెళ్లి వచ్చే సరికి..కూతురు ఉరి వేసుకుని విగతజీవిగా కన్పించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడే..తన కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృత్యురాలి తల్లి ఆరోపిస్తుంది. మృత్యురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story