వివాహేతర సంబంధం : కన్నింగ్ మహిళ చేసిన పని చూస్తే..

వివాహేతర సంబంధం : కన్నింగ్ మహిళ చేసిన పని చూస్తే..
X

భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యకోసం కొత్తగా ఇల్లు కట్టించాడు, ఆమెకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. కానీ ఆమె మాత్రం భర్తకు తలవంపులు తీసుకువచ్చింది.మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితో పరారైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటై జిల్లా మేల్‌నిలైపట్టిలో జరిగింది. కోవిల్‌పట్టి గ్రామానికి చెందిన సులోచన (32)కు మేల్‌నిలైపట్టికి చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అతను సింగపూర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇల్లు సరిగా లేకపోవడంతో భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న కారణంతో ఆమెకోసం లక్షలు పోసి కొత్త ఇల్లు కట్టించాడు. అంతేకాదు తన భార్య, తల్లికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతినెలా వేలాది రూపాయలు ఇంటికి పంపిస్తున్నాడు.

ఈ క్రమంలో భర్త పంపించిన డబ్బుతో సుఖ పడుతూ.. సులోచన అదే గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్తకు తెలిసి మందలించింది. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. శనివారం రాత్రి సులోచన ప్రియుడు వారి ఇంటికి వచ్చాడు. అతను రావడాన్ని గమనించిన అత్త కోడలి బండారాన్ని బట్టబయలు చేయాలనీ.. వాళ్ళు ఇంట్లో ఉండగా తలుపులు పెట్టి తాళం వేసింది. ఇంతలో గ్రామస్థులను పిలిచి పంచాయితీ పెట్టాలనుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ విషయం తెలిసిన కన్నింగ్ కోడలు.. ప్రియుడితో వెనక గేటు గుండా పారిపోయింది. గ్రామస్థులు వారికోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES