తాజా వార్తలు

కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు
X

మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా అని కేసీఆరే అన్నారని నాయిని గుర్తుచేశారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపైనా నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద అని, తామంతా ఓనర్లమేనని అన్నారు నాయిని. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని అన్నారు.

Also watch :

Next Story

RELATED STORIES