లవర్ కోసం యువతి చేసిన పని చూస్తే..

లవర్ కోసం యువతి చేసిన పని చూస్తే..
X

లవర్ కోసం యువతి చేసిన ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర లోని కందివాలి ప్రాంతానికి చెందిన యువతికి గోవండి ప్రాంతానికి చెందిన అమీర్‌ నౌషాద్‌ ఖాన్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో.. అతనికి సాయం చేయాలని భావించింది యువతి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి రూ.10 లక్షలు తీసుకుని లవర్‌తో జంప్ అయింది.

ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు ఆమె లవర్ అమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES