క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. తనలాగా..

క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. తనలాగా..

జబ్బు వచ్చిన తరువాత బాధ పడేకంటే.. రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మన చేతుల్లో ఉన్నంత వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా వచ్చిన తరువాత ఎందుకు ఇబ్బంది పడడం.. అంటూ నేటి యువతీ యువకులకు ఓ సందేశాన్ని అందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. గత కొంత కాలంగా క్యాన్సర్ కౌన్సిల్‌కు అంబాసిడర్‌గా వ్యవహిస్తున్న క్లార్క్.. తాను స్కిన్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ యువ క్రికెటర్లకు భావోద్వేగ సందేశం ఇచ్చాడు. యువకులు ఎవరూ స్కిన్ క్యాన్సర్ బారిన పడకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా సూచించాడు. 2006లో క్లార్క్‌‌కు తొలిసారి స్కిన్ క్యాన్సర్ రావడంతో చికిత్స చేయించుకున్నాడు.

తాజాగా మళ్లీ నుదుటిపై క్యాన్సర్ కణితులు రావడంతో వాటినీ సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు. మిగతా దేశాల వారితో పోలిస్తే.. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ. ఆసీస్ యువకులు తమ శరీరాన్ని వారే సూర్యకాంతి నుంచి రక్షించుకోవాలని స్మిత్ సూచించాడు. 2016లో స్కిన్ క్యాన్సర్ బారిన పడి 1960 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశాడు. 2011లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్ ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు క్లార్క్.

Tags

Read MoreRead Less
Next Story