షురూ అయిన వైవిధ్య ఉత్సవం.. ఉద్యోగ రొట్టెలకు భలే గిరాకీ!

షురూ అయిన వైవిధ్య ఉత్సవం.. ఉద్యోగ రొట్టెలకు భలే గిరాకీ!

కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే ప్రత్యేకం. అలాగే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశ నలుమూలల నుంచే కాదు.. ఇతర దేశాల నుంచి కూడా ఈ వేడుకకు భక్తులు తరలివస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం.. నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే వైవిధ్య ఉత్సవం.. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల రొట్టెల పండుగ సందడి అప్పుడే జిల్లాలో మొదలైంది.

రొట్టెల పండుగకు సింహపురి అంతా సిద్ధమైంది.. మొహరం పండుగ సందర్భంగా నిర్వహించే రొట్టెల పండుగకు విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.. ఈ ఉత్సవానికి ప్రభుత్వ పండగ హోదా కల్పించిన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు పండుగ జరుగుతుంది. నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు తమ కోర్కెల రొట్టెలు పట్టుకొని గంధ మహోత్సవంలో పాల్గొంటారు. గత ఏడాది 8 లక్షల మంది వరకు భక్తులు హాజరుకాగా ఈ ఏడాది ఆ సంఖ్య పది లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పండగకు హాజరయ్యే భక్తులు తమ కోర్కెలకు అనుగుణంగా రొట్టెలను వదులుతూ అందుకుంటుంటారు. ఈ నేపథ్యంలో రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది విద్య, సౌభాగ్యం, సంతానం, ఉద్యోగ రొట్టెలకు ఎక్కువగా గిరాకీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కీలకమైన గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కడప దర్గా పీఠాధిపతి హాజరవుతారు. 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహ, 14న ముగింపు కార్యక్రమం జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story